ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది దహించు ఏకాంతమే సహించలేనన్నది యుగాల ఈ దూరమే భరించలేనన్నది విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది కన్నీళ్ళలో ఎలా ఈదను నువే చెప్పు ఎదురవని నా తీరమా నిట్టూర్పుతో ఎలా వేగను నిజం కాని నా స్వప్నమా హా ఎలా దాటాలి ఈ ఎడారిని ఎలా చేరాలి నా ఉగాదిని క్షణం క్షణం నిరీక్షణం తపించవా స్నేహమా ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది